తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మెట్రో రెండో దశకు శరవేగంగా అడుగులుపడుతున్నాయి. మెట్రో రెండో దశలో ఐదు మార్గాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి. 76.2 కి.మీ.కు రూ.24,269 కోట్ల వ్యయం అవుతుందని డీపీఆర్‌లో అధికారులు పేర్కొన్నారు. ఇందులో 18 శాతం కేంద్రం నిధులతో మెట్రోరైలు ప్రాజెక్టులను వేర్వేరు నగరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యాలతో నిర్మిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో కేంద్రం భరించే వాటా సాధారణంగా 15 శాతం ఉంటుంది. కాని హైదరాబాద్ మెట్రో రెండోదశలో 18 శాతం వరకు ప్రతిపాదిస్తున్నారు.