తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ పై రేవంత్ సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ, బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియను 60 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది.