తెలంగాణలో విద్యావ్యవస్థకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా మధిరలోని లక్మీపురంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘వచ్చే ఏడాది కొత్త స్కూళ్లలోనే విద్యాబోధన ఉంటుంది. వీటిలో అన్ని రకాల వసతులు కల్పిస్తాం. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతాం’ అని అన్నారు.