మూడో టీ20లో భాగంగా నేడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో టీమిండియా, బంగ్లాదేశ్ జట్టుల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ గా బరిలోకి దిగిన శాంసన్ 40 బంతుల్లో 100 పరుగులు చేసాడు. అంతకుముందు రిషద్ హుస్సేన్ వేసిన ఓ ఓవర్‌లో సంజు శాంసన్ వరుసగా ఐదు సిక్సర్లు బాదడం విశేషం.చివర్లో సంజూ శాంసన్‌ను ముస్తాఫిజుర్ రెహమాన్ అవుట్ చేయడంతో బెంగాల్ ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 14 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 201 పరుగులు. సూర్య 71, ర్యాన్ పరాగ్ 1 పరుగుతో ఆడుతున్నారు.