సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది… కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. సాగు, తాగునీటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. బిందెడు మంచినీళ్ల కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చింది. ఇటీవల సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేటలో మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన పలువురు బావిలోని నీటిని తాగారు. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందగా, 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఒకరిని సంగారెడ్డి ఆసుపత్రికి, ఇద్దరిని నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.