Homeహైదరాబాద్latest Newsబాబా సిద్ధిఖీని హత్య చేసింది మేమే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన..!

బాబా సిద్ధిఖీని హత్య చేసింది మేమే.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన..!

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలోని సిద్ధిఖీపై శనివారం సాయంత్రం ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన మృతి చెందారు. కాగా, బాబా సిద్ధిఖీని తామే హత్య చేశామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. సిద్ధిఖీ హత్య కేసులో పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. హత్యకు గురైన బాబా సిద్ధిఖీ బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ సన్నిహితుడిగా గుర్తింపు పొందాడు.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎప్పటినుండో సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన సన్నిహితుడి హత్య నేపథ్యంలో సల్మాన్ ఖాన్ భద్రతపై ఆందోళన నెలకొంది. దీంతో ముంబైలోని సల్మాన్ నివాసం వద్ద భద్రతను పెంచారు.

Recent

- Advertisment -spot_img