గత వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఆలయాలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని, ఐదేళ్లలో ఆలయాలను భ్రష్టు పట్టించారని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రసాదాల్లో కల్తీ జరిగిందని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంట్లో ఒక మతం, ఇంటి బయట మరో మతం అంటూ మాట్లాడే ఏ నాయకుడిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు.ఇదిలా ఉండగా 2020 డిసెంబర్‌లో విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.