Homeహైదరాబాద్latest Newsరాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబుకు ఉన్న అపార అనుభవం కీలకం : పవన్ కల్యాణ్

రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబుకు ఉన్న అపార అనుభవం కీలకం : పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు పల్లె పండుగ వారోత్సవాలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లె పండుగ వారోత్సవాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. రాష్ట్ర క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుల అవసరం ఎంతో ఉందన్నారు.
ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభల్లో ఆమోదం పొందిన పనులకు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఈ పనులను సంక్రాంతికి ముందే పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రతి పంచాయతీలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి.. ప్రతి పంచాయతీ కార్యాలయంలో పౌర విజ్ఞాన బోర్డు ఏర్పాటు చేసి వాటి వివరాలను తెలియజేస్తున్నాం.. ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రానికి ఏడాదికి 10,000 కోట్లు నిధులు సమకూరుతాయి.నైపుణ్యం లేని వారికి 15 రోజుల్లో పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, గ్రామీణ కుటుంబాలకు కనీసం 100 రోజుల పని కల్పించాలని, వారి జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.
రాష్ట్రాభివృద్ధిలో సీఎం చంద్రబాబుకు ఉన్న అపార అనుభవం కీలకమన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని వెల్లడించారు. చంద్రబాబు బాబు నాయకత్వంలో గ్రామాభివృద్ధికి, పంచాయతీల అభివృద్ధి ద్వారా గ్రామ స్వరాజ్యం సాధించేందుకు ఈ కీలక నిధులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రూ.4500 కోట్లతో 30 వేలకు పైగా పనులు చేపట్టి సుమారు 8 లక్షల మందికి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img