జూ. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటివరకు రూ.506 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది. తాజాగా ఈ సినిమా OTTలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో సవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.