మహారాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీకి పారిశ్రామికవేత్త రతన్ టాటా పేరు పెట్టేందుకు మహారాష్ట్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. ముంబైలోని మహారాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీని 2022లో ప్రారంభించారు.విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మరియు డిప్లొమా కోర్సులను అందిస్తుంది.దివంగత వ్యాపారవేత్త రతన్ టాటా పేరు మీద విశ్వవిద్యాలయానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ గతవారం తీర్మానం చేశారు.