Homeహైదరాబాద్latest Newsరైతు భరోసా ఇంకెప్పుడు..?

రైతు భరోసా ఇంకెప్పుడు..?

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా హామీ అందని ద్రాక్షగానే మిగిలింది. వానకాలం పంట గడువు పూర్తికావస్తున్నా అన్నదాతకు ఎదురుచూపులు తప్పడం లేదు. యాసంగికి రైతు భరోసా కింద ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం పంపిణీకి గడువు దగ్గర పడింది. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. దసరాకు పంపిణీ చేస్తారని ఊరించినా చివరికి ఉసూరుమనిపించింది. దీంతో రైతుల్లో అసహనం నెలకొన్నది. ఇదే సొమ్మును రైతు రుణమాఫీకి జమ చేసి పెట్టుబడి సాయాన్ని విస్మరించిందని ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్‌ సర్కారు కనీసం రైతుభరోసా ఊసే ఎత్తడం లేదు. నిరుటి యాసంగికి డిసెంబర్‌, జనవరిలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని పంటలు కొతకొచ్చే ఆగస్టులో పంపిణీ చేసింది. ఈ ఏడాది జూలైలో ఇవ్వాల్సిన వానకాలం పెట్టుబడి సాయాన్ని అక్టోబర్‌ పూర్తవుతున్నా ఇవ్వనే లేదు. మరో నెల గడిస్తే ఈ ఏడాది యాసంగి రైతుభరోసా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వానకాలం సాయానికే దిక్కులేదు… ఇక యాసంగిపై ఆశలు పెట్టుకోవడం అత్యాశే అవుతుందనే చర్చ అన్నదాతల్లో జరుగుతున్నది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు సీజన్లలోనూ రైతులకు రైతుభరోసా కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.

Recent

- Advertisment -spot_img