Homeహైదరాబాద్latest Newsబీసీల రక్షణ చట్టం.. ఆ మంత్రులతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు

బీసీల రక్షణ చట్టం.. ఆ మంత్రులతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు

బీసీల ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మరో నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీ డిక్లరేషన్ లో భాగంగా బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై బుధవారం ఎనిమిది మంది బీసీ మంత్రులతో సమావేశం కానున్నట్టు మంత్రి సవిత వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాక్‌ సమావేశ హాల్ లో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి సవిత ఓ ప్రకటన విడుదల చేశారు….ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బీసీల రక్షణకు చట్టం తెస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని ప్రస్తావించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీ రక్షణ చట్టం నిబంధనల రూపకల్పనకు చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఎనిమిది మంది బీసీ మంత్రులతో సమావేశమవుతున్నట్లు మంత్రి వెల్లడించారు. తనతో పాటు మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొంటున్నారని తెలిపారు.

Recent

- Advertisment -spot_img