భారత్ – న్యూజిలాండ్ తొలి టెస్ట్ మొదటి రోజు ఆట రద్దయింది. వర్షం కారణంగా కనీసం టాస్ కూడా పడలేదు. ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండడంతో ఆట సాగేందుకు వీలు పడని పరిస్థితి తలెత్తింది. టీ బ్రేక్ సమయానికి ఇలానే ఉంది. అయితే, ప్రస్తుతం వర్షం తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ వర్షం ఆగితే రేపు ఉదయం త్వరగా మ్యాచ్ ప్రారంభం అవుతుంది.