Homeహైదరాబాద్latest News10 నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు… అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి..?.....

10 నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు… అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి..?.. అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డి హయాంలో తెలంగాణ రాష్ట్రం సర్వనాశనమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన పది నెలల్లోనే 80 వేల 500 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ ఎక్కిన 10 నెలల్లోనే మొత్తం 80,500 కోట్లు అప్పులుఅయ్యాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి..? ఎన్నికల హమీలేవీ తీర్చలేదు… ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు..అని కేటీఆర్ విరుచుకుపడ్డారు. మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు ? 80 వేల కోట్ల ధనం ఎవరి జేబులోకి వెళ్లినట్టు ??.. బడా కాంట్రాక్టర్ల బిల్లులకే ధారాదత్తం చేస్తున్నారా ? కమిషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా ??.. అప్పు.. శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టి…అవే అప్పుల కోసం ముఖ్యమంత్రి పాకులాడటమేంటి ? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో.. అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టాం..ప్రతిపైసాతో మౌలిక సదుపాయాలు పెంచాం….తీసుకున్న రుణంతో దశాబ్దాల కష్టాలు తీర్చాం..అని కేటీఆర్ తెలిపారు.
కానీ.. ముఖ్యమంత్రి తెస్తున్న అప్పుల “అడ్రస్” ఎక్కడ ?.. రుణమాఫీ చేయకుండా..! రైతుభరోసా వేయకుండా..!!.. ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా..! నెలలపాటు జీతాలు ఇవ్వకుండా..! ..ఇన్ని వేలకోట్లు ఏమైనట్టు ? ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు ?.. అని కేటీఆర్ ప్రశ్నించారు.
రాష్ట్ర సంపద సృష్టికి కాకుండా..సొంత ఆస్తులు పెంచుకోవడానికి..అప్పులు చేయడం క్షమించరాని నేరం.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదంలో ఉంది అని కేటీఆర్ అన్నారు.

.

Recent

- Advertisment -spot_img