Homeహైదరాబాద్latest Newsనాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఎనిమిది గేట్లు ఎత్తివేత

నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఎనిమిది గేట్లు ఎత్తివేత

నాగార్జున సాగర్ డ్యామ్ కు ఎగువ నుండి నీటి ప్రవాహం పెరుగుతుండడంతో బుధవారం సాయంత్రం ఎనిమిది క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల ఎత్తు ఎత్తి 64800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసారు. నాగార్జున సాగర్ జలాశయం పూర్తి నీటిమట్టం 590 అడుగులు ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులు ఉంది.నాగార్జున సాగర్ జలాశయం నుండి కుడి కాలువ ద్వారా 6253 క్యూసెక్కులు ఎడమ కాలువ ద్వారా 6002 క్యూసెక్కులు ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా 29907 క్యూసెక్కులు ఎస్ ఎల్ బి సి ద్వారా 1800 క్యూసెక్కులు నీటి విడుదల జరిగింది. నాగార్జునసాగర్ జలాశయం కు ఎగో ఉన్న శ్రీశైలం జలాశయం నుండి 1, 08, క్యూసెక్కుల నీరు రానుంది.

Recent

- Advertisment -spot_img