పదేళ్లలో రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీసిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీసింది అని అన్నారు. కానీ కాంగ్రెస్ అలా కాదు.. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల్లో ఎన్నో అద్భుతాలు చేసి.. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టింది. ఇచ్చిన హామీలను నెరవేర్చింది అని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించాలి. కష్టపడితేనే ప్రజల్లోకి వెళ్తాం. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది.బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి.. కాంగ్రెస్ను దెబ్బతీయాలని రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి అని అయన తెలిపారు.