Homeహైదరాబాద్latest Newsనేటి ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ ఆరు కొత్త విధానాలపై చర్చ

నేటి ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ ఆరు కొత్త విధానాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మీడియా ముందుకు వచ్చారు. అయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకేసారి ఆరు కొత్త పాలసీలు తీసుకొచ్చామని వెల్లడించారు.

  1. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పాలసీ
  2. ఏపీ ఎంఎస్ఎంఈ, ఎంటర్ ప్రెన్యూర్ డెవలప్ మెంట్ పాలసీ
  3. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ
  4. ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ
  5. ఏపీ ప్రైవేటు పార్కుల పాలసీ
  6. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ… తీసుకువచ్చినట్టు వివరించారు.

ఈ ఆరు కొత్త విధానాలపై నేటి కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అనేది తమ నినాదమని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తమ సంకీర్ణ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఒకే కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనేది తమ ప్రభుత్వ నినాదమని చంద్రబాబు అన్నారు. కుటుంబానికి పారిశ్రామికవేత్త ఉండాలన్నదే తమ దార్శనికమని, ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు కల్పించే పరిస్థితిని కల్పించాలని పేర్కొన్నారు.పెట్టుబడులు తెస్తాం… అభివృద్ధి చేస్తాం… సంపదను పెంచుతాం… పేదలకు సంక్షేమం రూపంలో పెరిగిన ఆదాయాన్ని అందిస్తాం అని పునరుద్ఘాటించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి సారిస్తామని, తీవ్రంగా దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు.

Recent

- Advertisment -spot_img