సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఓజీ’. ఈ సినిమా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్ స్టార్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తిఅయింది.. కాకపోతే పవర్ స్టార్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ లేట్ అయింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ని మళ్ళి ప్రారంభించారు. ప్రస్తుతం ‘ఓజీ’ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది.
హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓజీకి సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే.. ఈ షూటింగ్ లో పవన్ ఇంకా జాయిన్ కాలేదు. ఈలోగా పవన్ లేని సన్నివేశాలను సుజీత్ పూర్తి చేస్తున్నాడు. షూటింగ్ స్పాట్ కు సంబంధించిన ఫోటోలను చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేసారు .దీంతో ఓజీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.