ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం నడుస్తోందని మాజీ సీఎం జగన్ అన్నారు. తాజాగా ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాట్లాడతూ…కొన్ని ప్రాంతాల్లో లారీ ఇసుక ధర రూ.60 వేల వరకు ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో రూ.30 నుంచి 50 వేల వరకు ఉంది. ఇసుకపై విపరీతమైన ప్రచారం జరిగింది. ఒకవైపు ఇసుక ఉచితం అంటారు.. రేట్లు చూస్తే దారుణం అని మాజీ సీఎం జగన్ అన్నారు. టెండర్లకు రెండు రోజుల గడువు మాత్రమే ఇచ్చారు. దసరా పండుగ సందర్భంగా అందరూ బిజీగా ఉంటే ఆ సమయంలో టెండర్లకు రెండు రోజులు సమయం ఇవ్వడం దారుణమని అన్నారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది. మార్పు తీసుకొస్తామంటూ మోసాలకు తెర లేపారు. వైసీపీ హయాంలో ఇసుక చాలా పారదర్శకంగా ఉండేదని జగన్ తెలిపారు.