Homeహైదరాబాద్latest Newsగత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ పార్టీ సర్వనాశనం చేసింది.. సీఎం చంద్రబాబు

గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ పార్టీ సర్వనాశనం చేసింది.. సీఎం చంద్రబాబు

గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైసీపీ పార్టీ సర్వనాశనం చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఆ పార్టీ హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. తనను జైల్లో పెడితే పవన్ కళ్యాణ్ వచ్చి పరామర్శించేవారని గుర్తు చేశారు. ప్రధాని మోదీని చూసి అందరూ నేర్చుకోవాలిని అన్నారు… ఆయన పట్టుదల, కృషి వల్ల మూడోసారి ప్రధాని అయ్యారు. దేశంలో ఎవరికీ దక్కని విజయం మోదీకి దక్కిందంటే దాని వెనుక కఠోరమైన శ్రమ, క్రమశిక్షణ ఉన్నాయి అని తెలిపారు. ఎక్కడా తప్పు చేయకుండా పార్టీని ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు అని తెలిపారు.
వైసీపీ పార్టీ చేయని తప్పులు లేవన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమికి 93 శాతం ఓటింగ్ లభించిందన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img