పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాకి జ్యోతి కృష్ణ దర్సకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలోనిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. హరిహర వీరమల్లు మొదటి సింగిల్‌ని పవన్ కళ్యాణ్ పాడారని మేకర్స్ ఇంతకుముందు ప్రకటించగా, దానికి సంబంధించిన మరో వార్త బయటకు వచ్చింది. స్టూడియోలో కాకుండా మూవీ సెట్లోనే గంట వ్యవధిలో పవన్ కళ్యాణ్ పాటను రికార్డ్ చేసినట్లు సమాచారం. మరోవైపు నవంబర్ 10 నాటికి షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.