Homeహైదరాబాద్latest Newsకాస్టింగ్ కౌచ్ పై ప్రశ్న.. అనన్య నాగళ్ల సమాధానం ఏంటి ?

కాస్టింగ్ కౌచ్ పై ప్రశ్న.. అనన్య నాగళ్ల సమాధానం ఏంటి ?

అనన్య నాగళ్ల హీరోయినిగా నటించిన సినిమా ‘పొట్టెల్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నటి అనన్య నాగళ్ల కాస్టింగ్ కౌచ్ గురించి అడిగిన ప్రశ్నకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావడానికి భయపడుతున్నారా? ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కమిట్ మెంట్ అడుగుతారని, మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా? అని అనన్యను ఓ విలేకరి ప్రశ్నించారు. ఇతర రంగాల్లోనూ కూడా ఉంటుంది కానీ సినిమా వాళ్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అని అడిగితే ‘సినిమా ఛాన్స్‌ ఇచ్చే ముందు హీరోయిన్స్‌ను కమిట్‌మెంట్‌ అడుగుతుంటారు… వేరే రంగాల్లో అలా ఉండదు కదా అని విలేకరి చెప్పుకొచ్చారు. మీరు తెలుసుకోకుండా వందశాతం ఉంటుందని ఎలా అడుగుతున్నారు? అని అంటే అదేమీ లేదని ఆమె అన్నారు. అయితే మీరు చేసే అగ్రిమెంట్ లో కూడా ఉంటుందట కదా, మా ఫ్రెండ్సే చెప్పారు అని అంటే ఈ వందశాతం తప్పు అని అన్నారు. అవకాశం రావడం కంటే ముందే కమిట్‌మెంట్‌ అనేది టాలీవుడ్‌లో లేదు. ఎక్కడైనా పాజిటివ్, నెగెటివ్‌ అనేది సమానంగా ఉంటాయి. మీరు ఎక్స్ పీరియన్స్ చేయకుండా ఎలా అడుగుతున్నారు? నటిగా నేను చెబుతున్నా క్యాస్టింగ్ కౌచ్‌ పరిస్థితులైతే ఇండస్ట్రీలో లేవు’ అని అనన్య నాగళ్ల అన్నారు.

Recent

- Advertisment -spot_img