ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని నివారించేందుకు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు ముందడుగు వేశారు. క్యాన్సర్‌ను నివారించే బ్యాక్టీరియల్ వ్యాక్సిన్‌ను కనిపెట్టారు. దీనికోసం కొలి అనే బ్యాక్టీరియాను మార్చి వ్యాక్సిన్‌లో ఉపయోగించినట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ కణాలను పోలి ఉండే వాటిని గుర్తించి, వాటిపై దాడి చేసేందుకు ఈ ప్రొబయోటిక్ బ్యాక్టీరియా రోగనిరోధక వ్యవస్థను సిద్ధం చేస్తుందని పరిశోధకులు తెలిపారు.