Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ఆర్టీసీకి పంట పండింది… దసరా పండుగ తెచ్చిన ఆదాయం ఎన్ని కోట్లంటే..?

తెలంగాణ ఆర్టీసీకి పంట పండింది… దసరా పండుగ తెచ్చిన ఆదాయం ఎన్ని కోట్లంటే..?

పండుగల సమయంలో ఆర్టీసీలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో బతుకమ్మ, దసరా పెద్ద పండుగలు సమయంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నా.. ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో పండుగ సీజన్‌లోనూ తెలంగాణ ఆర్టీసీకి భారీ వసూళ్లు వచ్చాయి. ఈ నెల 1 నుంచి 15వ తేదీ మధ్య 15 రోజుల వ్యవధిలో కోట్లాది మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా.. ఆర్టీసీకి రూ.300 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 7 కోట్ల 7 లక్షల 73 వేల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణించారని టీజీఎస్‌ఆర్‌టీసీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ 15 రోజుల్లో ఆర్టీసీకి రూ.307.16 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా 10,512 అదనపు బస్సులను మళ్లించినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img