మన దేశంలో పాసింజర్ రైళ్ల నుంచి వేగంగా ప్రయాణించే రైళ్లు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే మన దేశంలో నెమ్మదిగా నడిచే రైలు ఒకటి ఉంది. రైలు దాదాపు 111 స్టేషన్లలో ఆగుతూ వెళ్తుంది. 37 గంటల జర్నీ తరువాత దాని గమ్య స్థానాన్ని చేరుకుంటుంది. అయితే నెమ్మదిగా నడిచే రైలు టిక్కెట్లకు మంచి డిమాండ్ ఉంది. ఇంతకీ ఆ రైలు ఏంటో తెలుసా.. ?
హౌరా-అమృత్‌సర్ మెయిల్ దేశంలోనే అత్యధిక స్టాప్‌లు ఉన్న రైలు. ఇది ఐదు రాష్ట్రాల్లో (పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్) ప్రయాణిస్తుంది. రైలు ప్రారంభమైన తర్వాత దాని మార్గంలో 111 స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు పెద్ద స్టేషన్లలో కొంచెం ఎక్కువసేపు ఆగుతుంది కానీ చిన్న స్టేషన్లలో ఒకటి లేదా రెండు నిమిషాల కంటే ఎక్కువ ఆగదు. ఈ రైలు హౌరా నుండి అమృత్‌సర్‌కు 1,910 కి.మీ దూరాన్ని చేరుకోవడానికి 37 గంటలు పడుతుంది.ఈ ట్రైన్ ది హౌరా స్టేషన్‌లో రాత్రి 7.15 గంటలకు బయలుదేరి మూడో రోజు ఉదయం 8.40 గంటలకు అమృత్‌సర్‌కు చేరుకుంటుంది. ఇది మళ్లీ అమృత్‌సర్‌లో సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరి మూడో రోజు ఉదయం 7.30 గంటలకు హౌరా స్టేషన్‌కు చేరుకుంటుంది.
ఈ రైలు టికెట్ ధరల విషయానికి వస్తే స్లీపర్ క్లాస్ రూ.695, థర్డ్ ఏసీ రూ. 1,870, రూ. టికెట్ ధరలు సెకండ్ ఏసీకి రూ.2,755, ఫస్ట్ ఏసీకి రూ.4,835గా అందుబాటులో ఉన్నాయి. ఈ రైలు మరిన్ని ప్రాంతాలను కవర్ చేస్తుండడంతో ప్రయాణికులు కూడా ఈ రైలు జర్నీని ఇష్టపడుతున్నారు.