వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ శివారులో మైనర్ బాలికపై జె విఘ్నేష్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. నిందితుడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే విఘ్నేష్.. తనపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని బాలిక తెలిపింది.’శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మైనర్ బాలికపై విఘ్నేష్ పెట్రోల్ పోసి నిప్పంటించడంతో కడప నిమ్స్ ఆసుపత్రిలో చేరింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కాలిన గాయాలతో బాలిక మృతి చెందిందని మైదుకూరు సబ్‌డివిజనల్ పోలీసు అధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ బాలికతో విఘ్నేష్‌కు గతంలోనే సంబంధం ఉంది. అయితే విఘ్నేష్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భవతి. మైనర్ బాలికకు ఆరు నెలల క్రితం విఘ్నేష్‌తో పరిచయం ఏర్పడింది. తనను పెళ్లి చేసుకోమని కోరింది. ఆమె డిమాండ్‌తో విసిగిపోయిన విఘ్నేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) సహా పలు సెక్షన్ల కింద విఘ్నేష్‌పై కేసు నమోదు చేశారు.