నేటి నుంచి గ్రూప్-1 పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనుండడంతో అభ్యర్థులు ఇప్పటికే కేంద్రాలకు చేరుకుంటున్నారు. అభ్యర్థుల్ని 1.30 గంటల వరకే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. అయితే ఒక నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను గేటు బయటే ఆపేసారు.. అభ్యర్థులు బాధపడుతూ చాలా కష్టపడి చదివాం సార్.. దయచేసి గేట్లు తెరవండి అంటూ అభ్యర్థులు ఏడుస్తున్నరు. బేగంపేటలో పరీక్షకు ఆలస్యంగా వచ్చిన ఓ అభ్యర్థి లోపలికి అనుమతించకపోవడంతో.. గోడదూకి లోపలి వెళ్లాలని ప్రయతించినగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు బాధ, నిరాశతో ఆవేదనకు గురి అవుతున్నారు.