Homeహైదరాబాద్latest Newsదీపావళి రోజున మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే.. పండుగ చేసుకోవచ్చా ? లేదా అని తెలుసుకుందాం.....

దీపావళి రోజున మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే.. పండుగ చేసుకోవచ్చా ? లేదా అని తెలుసుకుందాం.. !

దీపావళి పండుగ అంటే ఇంట్లో అందరూ కలిసి బాణాసంచా కాలుస్తూ ఆనందగా చేసుకునే పండుగ. అయితే దీపావళి పండుగను ఏ పరిస్థితుల్లో జరుపుకోకూడదో తెలుసుకోవాలి. కుటుంబంలో దీపావళి రోజున ఎవరైనా చనిపోతే మనం పండుగ జరుపుకోవచ్చా లేదా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. కాబట్టి ఈ పండుగ ఆ సమయంలో జరుపుకోవచ్చా లేదా అని తెలుసుకుందాం.. మతపరమైన దృక్కోణంలో, దీపావళి రోజున కుటుంబంలో ఎవరైనా మరణిస్తే, ఆ రోజు పండుగ జరుపుకోరు. ఎందుకంటే ఈ సమయంలో పూజ వంటి కార్యక్రమాలు నిషేధించబడ్డాయి. ఎందుకంటే ఈ కాలంలో సూతక కాలం 10 రోజుల నుండి ఒక నెల వరకు ఉంటుంది. సూతకం పాటించేటప్పుడు, కుటుంబం పండుగలు జరుపుకోకూడదు మరియు మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు అంత కలిసి ప్రార్థించాలి. దీపావళి రోజున వరైనా మృతి చెందితే , చాలా కుటుంబాలు సంవత్సరాల తరబడి పండుగ జరుపుకోరు. ఎందుకంటే పండగ సమయంలో కుటుంబ సభ్యులు చనిపోతే ఆ పండుగ చెల్లదని పరిగణిస్తారు. సాధారణ నమ్మకం ప్రకారం, కుటుంబ సభ్యుడు మరణించిన రోజు లేదా సంవత్సరంలో దీపావళి జరుపుకోకూడదు. అయితే కుటుంబంలో కొత్తగా ఎవరైనా పుట్టిన, లేదా ఇంట్లో కొత్తగా పెళ్లియినా వధువు వచ్చినా మళ్లీ పండుగ చేసుకోవచ్చని పెద్దలు చెబుతారు.

Recent

- Advertisment -spot_img