Homeహైదరాబాద్latest Newsకూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. యాంకర్ శ్యామల

కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. యాంకర్ శ్యామల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న దాడులపై వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల స్పందించారు. మంగళవారం జరిగిన సమావేశంలో శ్యామల మాట్లాడుతూ.. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఆమె ప్రశ్నలు సంధించారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు జరిగితే పవన్ కళ్యాణ్ చూడడానికి ఎందుకు రాలేదని యాంకర్ శ్యామల ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించే బాధ్యత మన డిప్యూటీ సీఎంకు లేదని పవన్ కల్యాణ్ పై శ్యామల మండిపడ్డారు. దళిత వర్గానికి చెందిన బాలికను చిన్నచూపు చూస్తున్నారని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో జగన్ 30 వేల మంది అమ్మాయిలను మిస్సయ్యారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలేనన్ని దారుణాలు జరుగుతున్నాయని, వాటిపై డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించడం లేదని శ్యామల పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు.ఈ రాష్ట్రంలో బాలికలు, మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత వల్లే ఇవన్నీ జరగడం దురదృష్టకరమన్నారు.ఈ రాష్ట్ర చరిత్రలో ఈ నాలుగు నెలలోనే జరిగినన్నీ దారుణాలు ఎప్పుడు కూడా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img