నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. ఈరోజు ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత క్రమంగా భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. సెన్సెక్స్ 930 పాయింట్లు నష్టపోయి 80,220 వద్ద ముగిసింది. నిఫ్టీ 309 పాయింట్లు నష్టపోయి 24,472 వద్ద ముగిసింది. మరియు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 84.07 దగ్గర ముగిసింది.
నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎం అండ్ ఎం, భారత్ ఎలక్ట్రానిక్స్, కోల్ ఇండియా, టాటా స్టీల్ భారీ నష్టాలను చవిచూడగా, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పవర్, రియల్టీ, టెలికాం, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ అన్ని రంగాల సూచీలు 2-3 శాతం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.5 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.8 శాతం చొప్పున క్షీణించాయి.