Homeహైదరాబాద్latest Newsప్రముఖ టాలీవుడ్ నిర్మాత అరెస్ట్

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అరెస్ట్

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్ అయ్యారు. రాయదుర్గంలో వేల కోట్ల రూపాయల విలువైన 84 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో కొనుగోలు చేసేందుకు శివరామకృష్ణ ప్రయత్నించారు. 2003లో అప్పటి ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరడంతో.. అవి నకిలీ డాక్యుమెంట్లని కోర్టు తేల్చింది. శివరామకృష్ణతో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అక్టోబర్ 19న శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగం గౌడ్ ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. శివరామకృష్ణ మహేశ్ బాబుతో యువరాజు, వెంకటేశ్ తో ప్రేమంటే ఇదేరా, రవితేజతో దరువు, యువత, రైడ్, ఏమో గుర్రం ఎగరావొచ్చు, అందరి బంధువయ వంటి పలు సినిమాలు నిర్మించారు.

Recent

- Advertisment -spot_img