తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైడ్రా తీసుకునే చర్యలు పేదలు, మధ్య తరగతికే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. FTL, బఫర్ జోన్, హెచ్‌ఎఫ్‌ఎల్.. పేదలు, మధ్యతరగతికేనా అని నిలదీశారు. వీటి విషయంలో ధనవంతులు, పెద్దవాళ్లకు మినహాయింపు ఉంటుందేమో అని కేటీఆర్ ‘X’ వేదికగా ఎద్దేవా చేశారు.