Homeహైదరాబాద్latest Newsఆస్తి కోసం తల్లిని, చెల్లిని రోడ్డున పడేసాడు.. జగన్ లాంటి వాళ్లతో రాజకీయాలు చేస్తాననుకోలేదు :...

ఆస్తి కోసం తల్లిని, చెల్లిని రోడ్డున పడేసాడు.. జగన్ లాంటి వాళ్లతో రాజకీయాలు చేస్తాననుకోలేదు : సీఎం చంద్రబాబు

ఆస్తిలో వాటా ఇవ్వనంటూ తల్లిని, చెల్లిని రోడ్డున పడేసిన జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. జగన్ లాంటి వాళ్లతో రాజకీయాలు చేస్తాననుకోలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఆస్తిలో వాటా ఇప్పిస్తానంటే తనపై విమర్శలు చేయవద్దని చెల్లికి షరతులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీలో ఉన్నామని చెప్పుకోవడానికి కూడా ఆ పార్టీ నేతలు సిగ్గుపడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తండ్రి సంపాదించిన ఆస్తి అమ్మకు రాకూడదా అని ప్రశ్నించిన సీఎం, 2004లో జగన్ కు ఎంత ఆదాయం ఎంత అని,, ఈ లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు.

Recent

- Advertisment -spot_img