సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా శుక్రవారం బోనస్ చెల్లించనున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో ప్రకటించారు. ఇందుకోసం రూ.358 కోట్లు విడుదల చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్‌ను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన సింగరేణి సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది చెల్లించిన దీపావళి బోనస్ కంటే ఇది రూ.50 కోట్లు ఎక్కువ కావడం విశేషం. దీపావళి బోనస్‌ను శుక్రవారం మధ్యాహ్నంలోగా కార్మికుల ఖాతాల్లో జమ చేయాలి. దీపావళి బోనస్ కింద ఒక్కో కార్మికుడు రూ.93,750 అందుకుంటారు. కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 40,000 మంది కార్మికులకు ఈ బోనస్ లభించనుంది.