ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిద్ నగర్ లో గురువారం అర్ధరాత్రి కొంతమంది దొంగలు హనుమాన్ ఆవులను దొంగలించడానికి ప్రయత్నించారు. ఆరు ఆవులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి వాటిని వాహనంలో ఎక్కించడానికి ప్రయత్నించగా కొంతమంది గుర్తించడంతో వారు పరారయ్యారు. దొంగలు ఇచ్చిన ఇంజక్షన్ వల్ల ఆరు ఆవులు అపస్మారక స్థితిలో పడిపోయాయి. బిచ్కుంద బాన్సువాడ ప్రధాన రహదారి పక్కన గల వాజిద్ నగర్ ఈ ఘటన జరగడం సంచలం సృష్టిస్తుంది. ప్రధాన రహదారి పక్కనే గల వాజిద్ నగర్ లో ఒకే దగ్గర పడుకుని ఉన్న హనుమాన్ ఆవులను దొంగలించడానికి మత్తు ఇంజక్షన్లు ఇచ్చారు, వాటిని వాహనంలో ఎక్కించడానికి ప్రయత్నించడంతో ప్రధాన రహదారి కావడం వల్ల వారికి వాటిని దొంగలించడానికి సాహసం చేయలేకపోయారు. ఆరు ఆవులకు మత్తు ఇంజక్షన్లు ఇవ్వడంతో అవి అర్ధరాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఇంకా అపస్మారక స్థితిలో పడి ఉన్నాయి. పశు వైద్య అధికారులు వచ్చి వాటికి మందులు ఇస్తున్నారు. ఈ విషయంపై ఒక వర్గమే ఈ పనికి పాల్పడిందంటూ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. పక్కనే మహారాష్ట్ర ప్రాంతం, మరొకవైపు కర్ణాటక ప్రాంతం ఉండడం వల్ల అక్కడ నుంచి ఒక వర్గానికి చెందిన వారు పెద్ద ఎత్తున అర్ధరాత్రి పూట హనుమాన్ ఆవులు, దూడలు ఎత్తుకపోవడానికి ఇంజక్షన్లు ఇచ్చి బులెరోవాహనంలో తరలించుకొనిపోతున్నారు
వాజిద్ నగర్ హనుమాన్ మందిరం కుచెందిన ఆవులపై జిహాదీగ్యాంగ్ చేస్తున్న దొంగతనాలను అరికట్టాలంటూ గ్రామస్తులు పోలీస్ శాఖకు కోరుతున్నారు.