మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం బంగ్లాదేశ్ లో హిందువుల భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. చటోగ్రామ్‌లో సనాతన జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగగా.. తాత్కాలిక ప్రభుత్వం ముందు ఎనిమిది డిమాండ్లు ఉంచారు. వాటిని నెరవేర్చేవరకు వీధుల్లో తమ నిరసన కొనసాగుతుందని కొందరు హిందూ ఉద్యమకారులు పేర్కొన్నారు.