Homeహైదరాబాద్latest Newsజన్వాడ రేవ్ పార్టీ పై కేటీఆర్ మౌనం ఎందుకు? ఆ పార్టీతో కేటీఆర్ కు కూడా...

జన్వాడ రేవ్ పార్టీ పై కేటీఆర్ మౌనం ఎందుకు? ఆ పార్టీతో కేటీఆర్ కు కూడా సంబంధం ఉందా..?

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల జన్వాడ రిజర్వ్ కాలనీలోని ఫామ్ హౌస్ పై రాజేంద్రనగర్ డీసీపీ, సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేయగా, 42 మందితో కలిసి రేవ్ పార్టీ చేసుకున్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనపై అన్నింటికీ సోషల్ మీడియాలో వెంటనే స్పందించే కేటీఆర్.. ఇప్పటి వరకు స్పందించలేదు. ఇలా చేస్తే ప్రజలు కేటీఆర్ ని ఎలా నమ్ముతారు. సొంత బావమరిది మీద మీడియా లో ఇంత పెద్ద తప్పు చేసాడని చర్చ నడుస్తుంటే..నోరుమూసుకుని ఉంటే ఎలా.. నిజమో.. అబద్ధమో ఏదో ఒకటి స్పందించాలి కదా.. ఇప్పుడు కేటీఆర్ ఇలా మౌనంగా ఉండడం వల్ల.. ఆ పార్టీతో కేటీఆర్ కు కూడా సంబంధం ఉంది అన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. చూడాలి మరి ఇప్పటికైనా కేటీఆర్ ఈ ఘటనపై స్పందిస్తాడా? లేదా ఇలాగే మౌనంగా ఉంటాడా?.

Recent

- Advertisment -spot_img