నాగచైతన్య – శోభిత విడాకులు తీసుకుంటారని జోస్యం చెప్పిన ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వారంలోగా ఈ కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్ ను ఆదేశించింది. వేణు స్వామిపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు మేరకు విచారణకు హాజరుకావాలని గతంలో మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ క్రమంలో ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తాజాగా ఆ స్టేను హైకోర్టు ఎత్తివేసింది.