తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవలే ‘తమిళగ వెట్రి కళగమ్’ అనే రాజకీయ పార్టీ పెట్టారు. అయన పూర్తిగా రాజకీయ ప్రవేశం చేసారు. తాజాగా అయన నిన్న విల్లుపురం జిల్లా విక్రవాండిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని తన పొలిటికల్ స్పీచ్ ఇచ్చారు. దళపతి విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పారు. సైద్ధాంతికంగా బీజేపీతో విభేదిస్తామనీ, డీఎంకేను రాజకీయ ప్రత్యర్థిగా పరిగణించాలన్నదే తమ పార్టీ వైఖరి అని స్పష్టం చేశారు. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీ స్పీచ్ పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సాధువులు & సిద్ధుల భూమి అయిన తమిళనాడులో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించినందుకు హీరో విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.