జమ్మూ ప్రాంతంలోని అఖ్నూర్ సెక్టార్‌లో సోమవారం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో బుల్లెట్ తగిలి నాలుగు సంవత్సరాల వయసున్న ఫాంటమ్ అనే ఆర్మీ డాగ్ మరణించినట్లు ఫోర్స్ అధికారులు తెలిపారు. ఫాంటమ్ యొక్క ధైర్యం, విధేయత మరియు అంకితభావం ఎప్పటికీ మరచిపోలేము అని ఫోర్స్ అధికారులు తెలిపారు.
డాగ్ ఫాంటమ్ 25 మే 2020న జన్మించింది. బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందినది. ఇది ప్రత్యేకంగా దాడి చేసే కుక్కగా ట్రైనింగ్ పొందింది. అది ఆగస్టు 12, 2022 న ఆర్మీలో చేరినట్లు మీరట్‌లోని ఆవీసీ సెంటర్ నుండి జారీ చేయబడిందని అధికారులు తెలిపారు. ఆర్మీ డాగ్‌లు దగ్గరి నుండి శత్రు లక్ష్యాలపై గూఢచర్యం చేయడానికి అనుమతించే గాడ్జెట్‌లతో అమర్చబడి ఉంటాయి. ‘‘మన నిజమైన హీరో, ధైర్యవంతులైన ఇండియన్ ఆర్మీ డాగ్ ఫాంటమ్ త్యాగానికి మేము సెల్యూట్ చేస్తున్నాము’’ అని ఇండియన్ ఆర్మీ అధికారి ఒకరు అన్నారు.