Homeహైదరాబాద్latest Newsసైబర్ ట్రాప్‌లో పడ్డ రైల్వే ఉద్యోగి.. రూ.72 లక్షలు మాయం..!

సైబర్ ట్రాప్‌లో పడ్డ రైల్వే ఉద్యోగి.. రూ.72 లక్షలు మాయం..!

అనంతపురం జిల్లా గుత్తిలో సైబర్‌‌ మోసం వెలుగులోకి వచ్చింది. ముంబైక్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులమంటూ ఫోన్ చేసిన నేరగాళ్లు.. ఓ రైల్వే ఉద్యోగి నుంచి రూ.72లక్షలు కొట్టేశారు. ముంబై బాంబుబ్లాస్ట్‌ ఘటనలో మీ పేరు ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు తెలిపాడు. అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు డబ్బు పంపాలని నేరగాళ్లు బెదిరించినట్లు చెప్పాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img