Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (04-11-2024, సోమ‌వారం)

నేటి రాశి ఫలాలు (04-11-2024, సోమ‌వారం)

మేషం
నూతన కార్యాలు విజయవంతంగా పూర్తి. ఇంతకాలం పడిన కష్టం కొలిక్కివస్తుంది. కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. రాబడి సంతృప్తికరం. వ్యాపారులు తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పని భారం కొంత తగ్గవచ్చు. పారిశ్రామికవేత్తల అంచనాలు ఫలిస్తాయి. కళాకారులు, పరిశోధకులకు అప్రయత్న అవకాశాలు.

వృషభం
సమాజంలో విశేష గౌరవమర్యాదలు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఊహించని రీతిలో సొమ్ము అందుతుంది. బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్తేజం కలిగిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారులకు భాగస్వాములతో వివాదాల పరిష్కారం. ఉద్యోగులకు విధి నిర్వహణలో అనుకూల పరిస్థితి. రాజకీయవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారులు, క్రీడకారులు ప్రతిభను నిరూపించుకుంటారు.

మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్య కార్యాలు ఎవరిసాయం లేకుండా పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. సోదరులతో వివాదాలు తుది దశకు చేరుకుంటాయి. వ్యాపా రులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశం. రాజకీయ, పారి శ్రామికవేత్తలకు తగిన గుర్తింపు. కళాకారులకు అనుకూల సమయం.

కర్కాటకం
కొన్ని కార్యక్రమాలను కుదించుకుంటారు. బా ధ్యతలు ఉక్కిరిబిక్కిరిచేస్తాయి. విద్యార్థుల శ్రమ అంతగా ఫలించదు. ఆస్తి విషయంలో బంధువుల తో వివాదాలు. అనుకున్న ఆదాయం సమకూరక ఇబ్బందులు. కొన్ని వేడుకలు వాయిదా వేస్తారు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు, కళాకా రులకు అంచనాల్లో పొరపాట్లు వైద్యులు, క్రీడాకారులకు నిరాశాజనకం. వారం మధ్యలో శుభవార్త లు. వాహనయోగం. మానసిక ప్రశాంతత.

సింహం
నిరుద్యోగులకు అనుకోని ఇంటర్వ్యూలు. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరం. పరిచయాలు పెరుగుతాయి. కొంతకాలంగా ఇతరుల వద్ద నిలిచిపోయిన సొమ్ము అందుతుంది. కుటుంబ వివాదాల పరిష్కారం. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు కంపెనీల ఏర్పాటులో ముందడుగు వేస్తారు. కళాకారులు, పరిశోధకులకు ఉత్సాహవంతం.

కన్య
చేపట్టిన కార్యాలు సకాలంలో పూర్తి. కాంట్రాక్టులు పొందుతారు. జీవితాశయం నెరవేరుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో విజయం. భూవివాదాల నుంచి బయటపడతారు. ఆదాయం వృద్ధి చెంది అవసరాలు తీరతాయి. వ్యాపారులకు మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు విధుల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి ఊహించని అవకాశా లు. కళాకారులకు నూతనోత్సాహం.

తుల‌
ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ప్రత్యర్థులు సహాయకారులుగా నిలుస్తారు. వాహనాలు, భూములు కొంటారు. నిరుద్యోగుల యత్నాల్లో కదలికలు. అప్రయత్న ధనలాభం. అప్పుల బాధల నుంచి విముక్తి. ఇంట్లో శుభకార్యా లపై చర్చలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు విధుల్లో ఉత్సాహంగా ఉంటుంది. పారిశ్రామిక వేత్తలకు కొంత ప్రోత్సాహకరం. కళాకారులు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు.

వృశ్చికం
ఒక సమస్యను నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. ఆదాయం ఆశాజనకం. రావలసిన సొమ్ము అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే ఛాన్స్. వ్యాపార విస్తరణ కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగుతాయి. నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు శుభవార్తలు. పారిశ్రామికవేత్తలకు కొత్త సంస్థల ఏర్పాటులో విజయం. కళాకారులు, క్రీడాకారులు అనుకున్నది సాధిస్తారు.

ధనుస్సు
పరిస్థితులను అంచనా వేసి నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితుల నుంచి మాట సాయం. పట్టుదలతో ముందుకు సాగి సమస్యలు అధిగమిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు ప్రతిభాపాటవాలను చాటుకుంటారు. ఆదాయం మెరుగుపడుతుంది. వ్యాపారుల అంచనాల మేరకు పెట్టుబడులు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు సంభవం. రాజకీయ, పారి శ్రామికవేత్తలకు కలిసొచ్చేకాలం.

మకరం
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వాళ్ళు ఈరోజు కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆస్తి వ్యవహారాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రముఖుల నుంచి పిలుపు రావచ్చు. అనుకున్న రాబడి దక్కి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులు విధుల్లో కొంత శ్రద్ధ చూపాలి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులకు అవకాశాలు పెరుగుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరం. కళాకారులు, వైద్యుల కృషి ఫలిస్తుంది.

కుంభం
స్నేహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. నేర్పుగా కొన్ని చిక్కుల నుంచి బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. రావలసిన డబ్బు సమకూరుతుంది. కుటుంబంలోని అందరి ఆదరణ పొందుతారు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులు నిర్దేశించిన బాధ్యతలు పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. కళాకారులు, క్రీడాకారులు సత్తా చాటుకుంటారు.

మీనం
కొన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవం. ప్రముఖులు నుంచి కీలక సందేశం. ఊహించని రీతిలో రాబడి దక్కుతుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతా యి. కుటుంబంలో వివాదాలు సర్దుకుంటాయి. బంధువులు మరిన్ని బాధ్యతలు పెంచుతారు. వ్యాపారులు ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూల వాతావరణం. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం. క్రీడాకారులు విజయపథంలో సాగుతారు.


Recent

- Advertisment -spot_img