బీసీ కులగణనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కులగణన కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు రేపటిలోగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం స్పష్టం చేశారు.