తెలంగాణలో త్వరలోనే నూతన విద్యుత్ పాలసీని తీసుకురాబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఆదివారం ఆయన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను పరిశీలించి మాట్లాడారు. ‘మే నాటికి 4 వేల మెగావాట్ల విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానిస్తాం. రాష్ట్రంలో డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నాం. 2028-29 నాటికి విద్యుత్ డిమాండ్ 22,488 మెగావాట్లకు చేరొచ్చు. మార్పులకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీని ప్రవేశపెడుతున్నాం’ అని స్పష్టం చేశారు.