యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ పార్ట్-1 ఓటీటీలోకి రానుంది. ఈ నెల 8 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ తదితరులు నటించారు. సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.