భారత ఒలింపిక్స్ అసోసియేషన్ (I0A) కీలక నిర్ణయం తీసుకుంది. 2036 ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్ దాఖలు చేసింది. 2036 ఒలింపిక్స్ భారత్లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పావులు కదుపుతోంది. 2036లో సమ్మర్ ఒలింపిక్ ను ఆతిథ్యం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను సమర్పించింది. దీంతో భారత్ వేదికగా ఈ విశ్వక్రీడలు జరిగే అవకాశం ఉంది.