తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. రేవంత్ సర్కార్ చేయనున్న కులగణన సర్వేలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను వినియోగించుకోనుంది. ఈ నేపథ్యంలోనే ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పని చేస్తాయి. సర్వే పూర్తయ్యే వరకు ఈ ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. అటు కులగణన సర్వేను ప్రభుత్వం ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.