Homeహైదరాబాద్latest Newsదేశంలో కుల వివక్ష ఉన్న మాట వాస్తవం : రాహుల్ గాంధీ

దేశంలో కుల వివక్ష ఉన్న మాట వాస్తవం : రాహుల్ గాంధీ

కుల గణనలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని రాహుల్ గాంధీ అన్నారు. బోయినపల్లిలోని భావజాల కేంద్రంలో మేధావులు, బీసీ సంఘాలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలో కుల వివక్ష ఉన్న మాట వాస్తవమన్నారు. కుల వివక్షపై ప్రధాని నరేంద్ర మోదీ ఇంతవరకు మాట్లాడలేదన్నారు. దేశంలో దళిత వ్యాపారులు ఎంత మంది ఉన్నారు? బ్యూరోక్రాట్ల ద్వారా కుల గణన అవసరం లేదు. మేం చేస్తున్నది కుల గణన కాదు.. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలనేది మేం నిర్ణయిస్తున్నాం అని అన్నారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎంత మంది నిరుపేదలు ఉన్నారో ?.. జాతీయ స్థాయిలో కులగణన చేపడతామని రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు కుల గణనలో ఏయే ప్రశ్నలు వేయాలో నిర్ణయించాలన్నారు. దేశంలో న్యాయ వ్యవస్థలో ఎంతమంది OBCలు ఉన్నారు? దేశం ఆర్థికంగా బలపడాలంటే కుల వివక్ష ఉండకూడదని రాహుల్ గాంధీ అన్నారు.

Recent

- Advertisment -spot_img