కార్తీక మాసంలో నాన్ వెజ్ తినొద్దని చెబుతారు పండితులు, పెద్దలు. కార్తీకమాసం వచ్చిందంటే నెల రోజుల పాటూ నాన్ వెజ్ ముట్టుకోవద్దనేస్తారు. దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. వర్షాకాలం పూర్తై చలికాలం ప్రారంభమయ్యే సమయంలో ఎన్నో ఇన్ఫెక్షన్లు శరీరంపై దాడి చేస్తాయి. జంతువుల శరీరంలోనూ ఈ మార్పులుంటాయి. అలాంటి జంతువుల మాంసాన్ని తినడం వల్ల అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్టే. అందుకే కార్తీకమాసంలో నాన్ వెజ్ మితంగా తీసుకోవాలని చెబుతుంటారు.