Homeహైదరాబాద్latest Newsకేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ సమావేశం

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ సమావేశం

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా అమిత్ షాతో పవన్ భేటీ అయ్యారు. సహకార శాఖ నిధుల కేటాయింపుపై అమిత్ షాతో పవన్ చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి చెందిన సరస్వతీ పవర్‌ భూములను స్వయంగా పవన్‌ కల్యాణ్‌ పరిశీలించారు.అంతకుముందు పవన్ మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షాతో మర్యాదపూర్వకంగా సమావేశమవుతున్నట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img